1, నవంబర్ 2014, శనివారం

పాలమూరు జిల్లా తొలి సంస్కృత కవి-మంథాన భైరవుడు



మంథాన భైరవుడు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి. క్రీ.శ. 10 వ శతాబ్ధికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు.  ''భైరవతంత్రం'' పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికలో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. ప్రముఖ కవి పండితులు, పరిశోధకులు మావవల్లి రామకృష్ణ కవి కుమార సంభవానికి రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు. భైరవుడు ''ఆనందకందకం'' అను మరో గ్రంథాన్ని రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు కూడా ఈ కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.

రచనలు
* భైరవ తంత్రం
* ఆనందకందకం

భైరవతంత్రంలోని శ్లోకాలు
గ్రంథం ప్రారంభంలో...
'' శ్రీహర మహాశాంతం భైరవం భీమనిగ్రహం


 సమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాస(వ)నం''

గ్రంథాంతంలో....
 ''ఏతత్తంత్రం మాయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః

ప్రియశిష్యాయ ధాతవ్యం పుత్రాయచ విశేషితః
ఇతి భైరవాగమే భూత తంతే సప్తవింశతి పటలః''

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి