29, జూన్ 2020, సోమవారం

ఊపిరి ఆడటం లేదు డాడీ!
"ఊపిరి ఆడటం లేదు డాడీ!"
ఇది ఎక్కడో అమెరికాలో వినిపించిన గొంతు కాదు
ఇతను దొంగ అంతకన్నా కాదు
ఇక్కడే...
మనదే..
గాలికి కొట్టుకుపోయిన మాటలు మూటలు కట్టాలి
పక్కదారి పట్టిన నిధులను పక్కలిరగదన్నాలి
వెంటిలేటర్ ఏ ధనవంతున్ని చేరనో వెతికి పట్టుకోవాలి
గొంతుపెగలకుండ లోలోనే
ఆగిన గుండెలెన్నో లెక్కపెట్టుకోవాలి.
అసలు దీనంతటికి కారణమైన
చైనోన్ని చెప్పుతోన తన్నాలి.

2 వ్యాఖ్యలు:

  1. హోమ్ మినిస్టర్ కి కరోనా వస్తే అపోలో లో జాయిన్ అయ్యాడు . కాంగ్రెస్ పొలిటిషన్ హనుమంతరావు కరోనా తో ఎదో ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు . కానీ ఒక సామాన్యుడు , పేదోళ్లు , మధ్య తరగతి జనాలు హాస్పిటల్స్ కోసం పిచ్చ్చి కుక్కల్లా తిరుగుతూన్నారు , ఇలా సౌకర్యాలు లేని ప్రభుత్వ హాస్పిటల్స్ లో బలవంతంగా చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. హోమ్ మినిస్టర్ వెళ్ళి అపోలోలో చేరడం నిజంగా హాస్యాస్పదం. ప్రభుత్వ హాస్పిటళ్ల మీద మంత్రి గారికున్న నమ్మకం అంత మాత్రమే అన్నమాట. ప్రజలకు నీతులు చెప్పే నైతిక హక్కు లేదు వీళ్లకు.

    ప్రత్యుత్తరంతొలగించు