1, జనవరి 2017, ఆదివారం

తెలుగు క్విజ్

    • తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం...
                       
    • రామాయణం- క్విజ్ 




    1.    రామాయణానికి ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటి?
    2.    రామాయణంలోని కాండలు, శ్లోకాల సంఖ్య ఎంత?
    3.     అయోధ్యను నిర్మించినది ఎవరు?
    4.      దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు?
    5.    దశరథుని ప్రధాన మంత్రి ఎవరు?
    6.    దశరథుని కొలువులోని మంత్రుల సంఖ్య ఎంత?
    7.    విభాండక మహర్షి కుమారుడు ఎవరుడు?
    8.     రావణాసురుడి తండ్రి పేరు ఏమి?
    9.    కుబేరుడు ఎవరి సోదరుడు?
    10.    కౌసల్య సుప్రజా అంటూ మేలుకొలుపు గీతాన్ని పాడింది ఎవరు?
    11.   తాటక విధ్వంసాన్ని సృష్టించిన జనపదాలు ఏవి?
    12.   తాటక కుమారుడు ఎవరు?
    13.   తాటకను రాముడు వధించిన బాణం పేరు ఏమిటి?
    14.   మారీచునిపై రాముడు ప్రయోగించిన బాణం ఏది?
    15.   సుభాహునిపై రాముడు ప్రయోగించిన బాణం ఏది?
    16.   విశ్వామిత్రుడి యజ్ఞభూమి పేరేమిటి?
    17.    విశ్వామిత్రుడి యజ్ఞానికి ఆటంకాలు కలిగించిన రాక్షసులు ఎవరు?
    18.    అహల్య, గౌతముల  పెద్ద కుమారుడు ఎవరు?
    19.   ఊర్మిళ తండ్రి పేరేమి?
    20.      భరతుని భార్య పేరేమి?
    21.     శత్రుఘ్నుడి భార్య పేరేమి?
    22.     జనకుడి తమ్ముడి పేరేమి?
    23.  కుశధ్వజుని కుమారైలు ఎవరు?
    24.     జమదగ్నిని చంపిన క్షత్రియుడు ఎవరు?

గమనిక: జవాబులు కింద వ్యాఖ్యలలో చూడండి.

4 కామెంట్‌లు:

  1. జవాబులు
    1.పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్
    2. 6 కాండలు , 24 వేల శ్లోకాలు
    3. మనువు
    4. వశిష్టుడు, వామదేవుడు.
    5. సుమంత్రుడు
    6. 8
    7. ఋష్యశృంగుడు
    8. విశ్రవసుడు
    9. రావణుడు
    10. విశ్వామిత్రుడు
    11. మంద, కరూశ
    12. మారీచుడు
    13. శబ్ధవేధి
    14. శీతేషువు
    15. ఆగ్నేయాస్త్రం
    16. సిద్దాశ్రమం
    17. మారీచుడు, సుభాహుడు
    18. శతానందుడు
    19. జనకుడు
    20. మాండవి
    21. శ్రుత కీర్తి
    22. కుశధ్వజుడు
    23. మాండవి, శ్రుత కీర్తి
    24 . కార్త్య వీరార్జునుడు

    రిప్లయితొలగించండి
  2. thanks for this information
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    రిప్లయితొలగించండి
  3. 3.జనకమహారాజు తమ్ముడు..? 4.శత్రుఘ్నుడు భార్య..? 5.సీతాదేవి కి గల మరో రెండు పేర్లు..? 6.కయికేయి దాసి..? 7.సుగ్రీవుడి మంత్రి...? 8.వాలి కుమారుడు..? 9.జటాయువు సోదరుడు..? 10.రావణుడి కొడుకు..? 11.సుగ్రీవుడి రాజ్యం పేరు..? 12.ఇక్ష్వాకు వంశస్తుల గురువు..? 13.బ్రమ్మాస్త్రం చే బందిపబడిన.?

    రిప్లయితొలగించండి