10, నవంబర్ 2013, ఆదివారం

ఆటవెలది

ఎదుటి వాడి గుణము యెంచవలదు, మన
తీరు బట్టి వాడు తిరుగుచుండు
అద్దమందు జూడ నగుపించదన్యంబు
జయుడి మాట నిజము జాబిలమ్మ!

4 కామెంట్‌లు:

  1. జయన్న గారూ,
    మీ పద్యం బాగుంది.
    "గుణము నెంచవలదు" అనండి. అక్కడ "యెంచవలదు" అని యడాగమం రాకూడదు.
    మీకు పద్యరచన పట్ల ఆసక్తికి సంతోషం. దయచేసి ఒకసారి "శంకరాభరణం" బ్లాగు చూడండి.
    http://kandishankaraiah.blogspot.in

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువులకు వందనాలు !
      మీ సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాను. మీ ప్రొత్సాహనికి ధన్యవాదాలు.
      మీ శంకరాభరణం బ్లాగ్ తరుచూ చూస్తుంటాను. ఓ రెండు సమస్యలకు పూరణలు కూడా రాశాను.

      తొలగించండి
  2. జయన్న గారు!

    మీ భావంలో చక్కదనం, ఆటవెలది వ్రాయాలన్న మీ ఆసక్తి నన్ను ఆకర్షించాయి. అభినందనలు!
    అయితే చిన్న చిన్న వ్యాకరణ దోషాలను తొలగించేందుకు, భావ వ్యక్తీకరణలో మరింత స్పష్టత పెంచేందుకు - మీ పద్యాన్ని ఇలా మారిస్తే బాగుంటుంది.

    "ఎదుటి వాని గుణము నెంచవలదు; మన
    తీరు బట్టి వాని తీరునుండు!
    అద్దమందు జూడ నగుపించు మన బొమ్మె!
    జయుని మాట నిజము జాబిలమ్మ!"

    మీరు మరిన్ని మంచి భావాలతో, మరిన్ని మంచి పద్యాలను రచించి, ’జాబిలమ్మ శతకము’ను పూర్తి చేయాలని నా ఆకాంక్ష!
    విజయోస్తు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గౌ. ఆచార్యులకు నమస్కారాలు
      మీ ప్రశంసకు, ఆశిస్సులకు , సూచనలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
      సదా మీ ఆశిస్సులు ఆకాంక్షిస్తూ...
      -జయన్న

      తొలగించండి